ఎన్నికలు నిర్వహించడానికే రాష్ట్రంలో కరోనా లేదంటూ తప్పుదోవ పట్టించారు: బుద్ధా

ఎన్నికలు నిర్వహించడానికే రాష్ట్రంలో కరోనా లేదంటూ తప్పుదోవ పట్టించారు: బుద్ధా
  • సీఎంలందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారన్న బుద్ధా
  • 'గన్నేరు పప్పు' అంటూ వ్యాఖ్యలు
  • పనికిమాలిన బుర్రకు 'ఓ' వేసుకోండి అంటూ ట్వీట్
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసం రాష్ట్రంలో కరోనా ఏమీ లేదంటూ  ప్రజలను, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. "దేశంలో ఉన్న సీఎంలు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు, కానీ గన్నేరు పప్పు మాత్రం కనీసం మాస్కు కూడా వేసుకోకుండా, కరోనా పెద్ద విషయమేమీ కాదని, పారాసిటమాల్ మాత్రతో పోతుందని, బ్లీచింగ్ పౌడర్ తో చచ్చిపోద్దని చెబుతున్నాడు" అంటూ సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేశారు.

"నెగిటివ్ వచ్చినవాళ్లను కొవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చిన పనికిమాలిన బుర్రకు 'ఓ' వేసుకోండి. అయినా డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బందికి ఇవ్వాల్సిన ఎన్-95 మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్టు కొట్టేసి రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్న మిమ్మల్ని జైల్లో వేయాలి విజయసాయిరెడ్డి గారూ!" అంటూ మరో ట్వీట్ చేశారు.


More Telugu News