భారత్ లో 480కి చేరిన మరణాలు... 24 గంటల్లో 991 కేసుల నమోదు

  • 45 జిల్లాల్లో రెండు వారాలుగా కేసులు నమోదు కాలేదన్న కేంద్రం
  • ఒక్కరోజు వ్యవధిలో 43 మంది మృతి
  • దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378
దేశంలో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరాలు తెలిపారు. కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 480కి చేరిందన్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 991 కొత్త కేసులు నమోదయ్యాయని, 43 మంది ప్రాణాలు విడిచారని తెలిపారు.

23 రాష్ట్రాల్లోని  45 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని అన్నారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి పెరిగిందని, ఇప్పటివరకు 1992 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు లవ్ అగర్వాల్ చెప్పారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక, ఏపీలో కరోనా నివారణ చర్యల గురించి చెబుతూ, విశాఖలో కట్టుదిట్టమైన చర్యలతో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని పేర్కొన్నారు.


More Telugu News