ఏప్రిల్ 20 నుంచి అందుబాటులోకి వచ్చే సేవలు ఇవే!
- దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాక్షిక సడలింపు
- ఎల్లుండి నుంచి కొన్ని సేవలను అనుమతించాలని కేంద్రం నిర్ణయం
- ఈ మేరకు తాజా మార్గదర్శకాల విడుదల
దేశంలో కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం రెండో దశ లాక్ డౌన్ ను మే 3 వరకు విధించినా, ఏప్రిల్ 20 నుంచి దశలవారీగా ఆంక్షలు సడలించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎల్లుండి సోమవారం నుంచి అనేక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం తాజా లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఏప్రిల్ 20 నుంచి అందుబాటులోకి వచ్చే సేవల వివరాలు
ఏప్రిల్ 20 నుంచి అందుబాటులోకి వచ్చే సేవల వివరాలు
- ఆయుష్ సహా అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
- అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలు, ఉద్యాన కార్యకలాపాలు (హార్టీకల్చర్) నిర్వహించుకోవచ్చు.
- రొయ్యలు, చేపల పెంపంకం, ఆక్వారంగానికి చెందిన ఇతర కార్యకలాపాలపై ఆంక్షలు ఉండవు.
- తేయాకు, కాఫీ, రబ్బరు తోటల్లో పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.
- పశుసంవర్ధక కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.
- ఆర్థిక రంగం, సామాజిక సేవల రంగంపై ఆంక్షల తొలగింపు
- భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనతో ఉపాధి హామీ పథకం కూలీలకు అనుమతి.
- ప్రజా సౌకర్యాలపై తొలగిన ఆంక్షలు.
- రాష్ట్ర పరిధిలో, అంతర్రాష్ట్ర సరకు లోడింగ్, అన్ లోడింగ్ కు అనుమతి (రవాణా).
- ఆన్ లైన్ బోధన, దూరవిద్య కార్యక్రమాలకు ప్రోత్సాహం.
- నిత్యావసర సరుకులు, వస్తువుల రవాణాకు అనుమతి.
- వాణిజ్య, ప్రైవేటు సంస్థల కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్.
- పరిశ్రమలు, పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలకు అనుమతి (ప్రభుత్వ/ప్రైవేటు).
- నిర్మాణ రంగ పనులు కొనసాగించవచ్చు.
- రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల మార్గదర్శకాలకు లోబడి అత్యవసర సేవల కోసం ప్రైవేటు వాహనాలను వినియోగించుకోవచ్చు. వైద్య, పశువైద్య, నిత్యావసరాల రవాణా, సేకరణ, నిర్దేశిత కేటగిరీల ఉద్యోగుల ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు.
- కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి.