20 ఏళ్ల వయసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉన్నారంటే.. ఫొటోలు ఇవిగో

  • భారత వైమానిక దళంలో పని చేస్తున్నప్పటి ఫొటోలు ట్వీట్ చేసిన ఉత్తమ్
  • మూడు ఫొటోలు షేర్ చేసిన ఎంపీ
  • వాటి వివరాలు కూడా చెప్పిన ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు భారత వైమానిక దళంలో పని చేశారు. పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనకు ఇరవై ఏళ్లున్నప్పుడు తీసుకున్న మూడు ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిని ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారో కూడా తెలిపారు.

మొదటి ఫొటోను1986 సెప్టెంబర్ లో కలైకుండ ఐఏఎఫ్ స్టేషన్‌లో ఐఏఎఫ్ ఎయిర్ టు ఎయిర్ గన్నెరీ ఫైరింగ్ రికార్డు సందర్భంగా  తీసుకున్నదని చెప్పారు. రెండో ఫొటోను భారత్, పాకిస్థాన్ సరిహద్దు దగ్గర మిగ్ 23 ఎమ్‌ఎఫ్ స్వింగ్ వింగ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపే ముందు తీసుకున్నదని అన్నారు. మూడో ఫొటో రాష్ట్రపతి భవన్‌లో డిప్యుటేషన్‌పై ఐఏఎఫ్‌లో ఫ్లైట్ లెఫ్ట్‌నంట్‌గా పని చేస్తున్నప్పుడు  తీసుకున్నది అని చెప్పారు. కాస్త ఆలస్యమైనా ఈ ఫొటోలను షేర్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.


More Telugu News