19 ఏళ్ల యువకుడిగా కనిపించనున్న సూర్య

  • గతంలో 13 ఏళ్ల కుర్రాడిగా అలరించిన సూర్య
  • సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా' 
  • యువకుడిగా కనిపించడం కోసం కసరత్తులు
మొదటి నుంచి కూడా సూర్య విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలా ఆయన గతంలో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో 13 ఏళ్ల కుర్రాడిగా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అదే తరహాలో ఇప్పుడు ఆయన మరో ప్రయోగం చేస్తున్నాడు.

సుధ కొంగర దర్శకత్వంలో జీఆర్ గోపీనాథ్ బయోపిక్ లో సూర్య  నటిస్తున్నాడు. తమిళంలో 'సురరైపోట్రు' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా, 'ఆకాశం నీ హద్దురా' టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాలో సూర్య కొంత సేపు 19 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడట. అలా కనిపించడం కోసం ఆయన గట్టి కసరత్తులే చేసినట్టు సమాచారం. 44 ఏళ్ల సూర్య .. తెరపై 19 ఏళ్ల యువకుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.


More Telugu News