కరోనాకు అమెరికాలో కొత్త చికిత్స.. పెద్ద ఎత్తున కోలుకుంటోన్న రోగులు!
- గిలియెడ్ కంపెనీ చికిత్సపై మళ్లిన ప్రపంచ దేశాల దృష్టి
- వారం రోజుల్లో కోలుకుంటున్న కరోనా రోగులు
- చికాగోలో 113 మందికి చికిత్స
- అందరూ కోలుకున్న వైనం
- త్వరలోనే గిలియెడ్ కంపెనీ ప్రకటన చేసే అవకాశం
కరోనా మహమ్మారి అమెరికాలో మరణ మృదంగం మోగిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఆ దేశంలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాకు సరైన చికిత్సా విధానం అందుబాటులో లేకపోవడం, లక్షణాలు సైతం కనపడనివ్వకుండా ఆ వైరస్ మనిషిలో ఉంటుండం ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో అమెరికా వైద్యులు చేస్తోన్న పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. గిలియెడ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఓ చికిత్సా పద్ధతిని కనిపెట్టింది.
ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుండడంతో అందరి దృష్టి దీనిపై పడింది. అయితే, దీనిపై ఆ సంస్థ మరిన్ని పరిశోధనలు చేస్తోంది. ఓ చికిత్స పద్ధతిని అమెరికాలోని కరోనా రోగులపై ఆ సంస్థ ప్రయోగించగా వారిలో అత్యధిక మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఆ చికిత్సా విధానంతో కొవిడ్-19 రోగులకు జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు అతి వేగంగా తగ్గాయి. రోగులు త్వరితగతిన కోలుకుంటున్నారు. ఈ పద్ధతిలో చికిత్స తీసుకున్న వారంతా వారం రోజుల లోపే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికి తాము చేసిన ప్రయోగ పరీక్షలను మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ఓ వార్త సంస్థకు గిలియెడ్ తెలిపింది.
కరోనాతో బాగా బాధపడుతున్న స్టేజ్-3 రోగులపై చేసిన ప్రయోగ పరీక్షల ఫలితాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పింది. ఈ వివరాలన్నీ కొన్ని రోజుల్లో (దాదాపు మే తొలి వారంలో) వస్తాయని తెలిపింది. పూర్తిగా అధ్యయనం చేసేంతవరకు ఈ చికిత్స పనిచేస్తుందని ప్రకటన చేయలేమని ఆ సంస్థ తెలిపింది. తమ చికిత్సకు మంచి స్పందన వస్తూ పెద్ద సంఖ్యలో అతి త్వరగా రోగులు కోలుకుంటుండడంతో గిలియెడ్ అమెరికాలోని 152 ప్రాంతాల్లో ప్రయోగ పరీక్షలు జరుపుతోంది.
చికాగో వర్సిటీ ఆసుపత్రిలోనూ ఈ ప్రయోగ పరీక్షలు జరుపుతోంది. ఇప్పటికే 113 మంది ప్రయోగ పరీక్షల కోసం ఆ ఆసుపత్రిలో చేరగా, వారందరికీ కరోనా పూర్తిగా తగ్గిపోయింది. చికాగోలో పెద్ద ఎత్తున రోగులు కోలుకోవడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఆ సంస్థ పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రపంచంలోని మార్కెట్లన్నీ దానివైపే చూస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లోనూ ఆ సంస్థ షేర్లు భారీగా పెరిగిపోతున్నాయి.