చాలా ఆలోచించే చరణ్ వీడియోను వదిలాము: దర్శకుడు రాజమౌళి

  • లాక్ డౌన్ కి ముందే 80 శాతం చిత్రీకరణ జరిగింది
  • చాలామంది ఎంజాయ్ చేశారు
  • కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేశారన్న రాజమౌళి  
ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా 'ఆర్ ఆర్ ఆర్'లో చరణ్ పాత్రకి సంబంధించిన ఒక వీడియోను వదిలారు. తాజాగా ఆ వీడియోను గురించి, టీవీ 9 ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడారు. "అల్లూరి సీతారామరాజు గురించి కొమరమ్ భీమ్ మాట్లాడితే ఎలా ఉంటుందా? అనే ఆలోచన మాకే కొత్తగా అనిపించింది. సాయిమాధవ్ తో వాయిస్ ఓవర్ రాయించి ఆ వీడియోను వదిలాము. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

లాక్ డౌన్ కి ముందే 80 శాతం చిత్రీకరణను పూర్తి చేశాము. ఆ మెటీరియల్ అంతా కూడా మా ల్యాప్ టాప్స్ లో వుంది. అయితే లాక్ డౌన్ పరిస్థితుల్లో చరణ్  వీడియోను రిలీజ్ చేయడం కరెక్టేనా? అనే ఆలోచనలో పడ్డాము. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉన్నవాళ్లు ఆ వీడియో చూసి దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుందనే నిర్ణయానికి వచ్చాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరి ఇంట్లో వాళ్లే వుండి ఈ వీడియోను రిలీజ్ చేశాము. ఈ వీడియోను చూసి చాలామంది ఎంజాయ్ చేశారు. కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేశారు .. వాటిని గురించి పట్టించుకోనవసరం లేదు" అని చెప్పుకొచ్చారు.


More Telugu News