లాక్ డౌన్ ను ఉల్లంఘించిన పెళ్లికొడుకు, పెళ్లికూతురు... అరెస్ట్!

  • గుజరాత్ లో లాక్ డౌన్ సమయంలో గుడిలో పెళ్లి
  • 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. అయినా కొందరు నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటించకుండా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.

ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. పెళ్లి కోసం నవసారీ జిల్లాలోని ఓ గుడిలో పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. అక్కడున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కొత్త పెళ్లికొడుకు, పెళ్లికూతురు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా నవసారి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వీరందరిపైనా చట్టపరంగా చర్యలు తీసకుంటామని చెప్పారు. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉండబోతున్న సంగతి తెలిసిందే.


More Telugu News