భారత్‌లో మరో 991 కరోనా పాజిటివ్ కేసులు... మహారాష్ట్రలో కొనసాగుతున్న జోరు!
- 24 గంటల్లో మొత్తం 43 మంది మృతి
- 14,378కి చేరిన కరోనా కేసులు
- ఇప్పటివరకు మొత్తం 480 మంది మృతి
- మహారాష్ట్రలో 3,323 మంది బాధితులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో భారత్‌లో 991 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 24 గంటల్లో మొత్తం 43 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 14,378కి చేరగా, ఇప్పటివరకు మొత్తం 480 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,991 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 11,906 మందికి చికిత్స అందుతోంది.
మరోపక్క, మహారాష్ట్రలో 24 గంటల్లో 118 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర సర్కారు తెలిపింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,323 గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 201 మంది మృతి చెందారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 1,707కి చేరింది. ఇప్పటివరకు ఢిల్లీలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులో 1,323 మందికి కరోనా సోకింది. రాజస్థాన్‌లో 1,229 మందికి సోకింది. మధ్యప్రదేశ్‌లో 1,310 మంది కరోనా బాధితులున్నారు. గుజరాత్‌లోపాజిటివ్ కేసుల సంఖ్య 1099కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో 805 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కేరళలో 396 మందికి కరోనా సోకింది.