లాక్ డౌన్ సమయంలో ప్రజల రక్షణపై సందేహాలు.. మహిళా బ్యాంక్ మేనేజర్ పై అత్యాచారం!

  • మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో దారుణం
  • ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం
  • లాక్ డౌన్ కారణంగా సొంతూరులో ఉండిపోయిన భర్త
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో తలుపు వేసుకుని ఉంటున్నారు. పక్కనున్న ఇంట్లో ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఒక మహిళపై ఒక దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఓ పోష్ ఏరియాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

మానభంగానికి గురైన బాధితురాలు (53) ఓ ప్రభుత్వ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నారు. నిన్న తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనతో... లాక్ డౌన్ సమయంలో ప్రజల రక్షణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

బాధితురాలు కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆమె భర్త రాజస్థాన్ సిరోహి జిల్లాలోని స్వస్థలంలో చిక్కుకుపోయారు. దీంతో, తమ ఫ్లాట్ లో ఆమె గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నారు.

అత్యాచారానికి పాల్పడిన దుండగుడు మెట్ల మీద నుంచి సెకండ్ ఫ్లోర్ కు వచ్చి, బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో, అతను ఇంట్లోకి  నేరుగా ప్రవేశించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


More Telugu News