పోలీసులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.. వారిపై ఓ సినిమా తీస్తా: దిల్‌రాజు
- పోలీసులపై సినిమా తీయాలని ఎప్పటి నుంచే వుంది
- కథ కూడా సిద్ధంగా ఉంది
- ఈ విపత్కాలంలో వారు అందిస్తున్న సేవలకు అభినందనలు
కరోనాపై పోరులో భాగంగా రాత్రనక, పగలనక శ్రమిస్తున్న పోలీసులపై సినిమా తీసేందుకు ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు ముందుకొచ్చారు. వారి గొప్పతనాన్ని వివరిస్తూ సినిమా తీయాలన్న కోరిక ఎప్పటి నుంచే ఉందని, ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో వారు అందిస్తున్న సేవలతో అది మరింత పెరిగిందని అన్నారు. ఇందుకు సంబంధించిన కథ కూడా సిద్ధంగా ఉందన్నారు. ఈ విపత్కాలంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలకు దిల్‌రాజు అభినందనలు తెలిపారు.
కాగా, నిన్న పోలీసు సిబ్బందికి రక్షణ మాస్కులు, శానిటైజర్లను దిల్‌రాజు పంపిణీ చేశారు. మెహిదీపట్నం రైతు బజారు వద్ద ఉదయం పోలీసు డిపార్ట్‌మెంట్‌కు దిల్ రాజు వీటిని అందజేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. మనల్ని రక్షించే వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని పేర్కొంది. మూడు రోజుల క్రితం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కూడా దిల్ రాజు మాస్కులు, శానిటైజర్లు అందించారు.