ఏపీ కరోనా నివారణ చర్యలను ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్రం!

  • ఏపీలో నివారణ చర్యలపై మై గవ్ పోర్టల్ ట్వీట్
  • ఇంటింటా సర్వే చేస్తున్నారని వెల్లడి
  • 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తున్నారంటూ వివరణ
దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా కట్టడి చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ గుర్తింపు తెచ్చుకుంది. ఈ అంశంలో కేంద్రం కూడా ఏపీ చర్యలను ప్రముఖంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మై గవ్ పోర్టల్ లో ఏపీ కరోనా కట్టడి విధానాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ స్థాయిలో కరోనా విస్తరణకు సమర్థంగా ముకుతాళ్లు వేస్తున్నారని మై గవ్ పోర్టల్ ట్వీట్ చేసింది.

ఏపీ సర్కారు కొవిడ్-19 వైరస్ మరింత వ్యాపించకుండా 16 కోట్ల మాస్కులను ప్రజలందరికీ పంపిణీ చేస్తోందని, రాష్ట్రంలో మూడో విడత ఇంటింటి సర్వే కొనసాగుతోందని వెల్లడించింది. కొవిడ్ కేసులను గుర్తించే క్రమంలో 1.47 కోట్ల గృహాల్లో 1.43 గృహాల్లో సర్వే చేశారని తెలిపింది. ఈ సర్వే ద్వారా 32,349 కేసులను వైద్యాధికారులకు సిఫారసు చేశారని, వాటిలో 9,107 మందికి పరీక్షలు నిర్వహించాలని సూచించారని పేర్కొంది.


More Telugu News