కరోనా సంక్షోభాన్ని అధిగమించి రూ.2.83 లక్షల కోట్లకు పెరిగిన మదుపరుల సంపద

  • లాక్ డౌన్ నేపథ్యంలో రెండో విడత ఉద్దీపనలు ప్రకటించిన ఆర్బీఐ
  • లాభాల బాటలో మార్కెట్లు
  • మార్కెట్ల అండంతో ఎగబాకిన మదుపరుల సంపద
కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల మధ్య పయనిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత మార్కెట్లు ఇవాళ ఆశాజనక ఫలితాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రెండో విడత ఉద్దీపనలు మార్కెట్లను విపరీతంగా ప్రభావితం చేశాయి. దాంతో మదుపరుల సంపద ఒక్కదుటున ఆకాశానికెగిసింది. మార్కెట్ల అండతో మదుపరుల సంపద రూ.2,83,740.31 కోట్లకు పెరిగింది. ఈక్విటీ విపణిలో సూచీలు పైకి ఎగబాకడం మదుపరులకు కలిసొచ్చింది.

దేశంలో తగినంత ద్రవ్య లభ్యతకు హామీ ఇచ్చేలా ఆర్బీఐ నుంచి వచ్చిన సానుకూల ప్రకటనలు మార్కెట్లను ప్రభావితం చేశాయని, ఆర్థిక స్థిరత్వం దిశగా ఆర్బీఐ తీసుకున్న చర్యలతో మార్కెట్లే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థ కూడా కోలుకుందని, ముఖ్యంగా స్తబ్దుగా ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఒక్కసారిగా కదలిక వచ్చినట్టయిందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ విభాగం ఉపాధ్యక్షుడు అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు.


More Telugu News