అతని విలువేంటో లాక్ డౌన్ కారణంగా తెలిసొచ్చింది: ఆనంద్ మహీంద్రా
- లాక్ డౌన్ తో సకలం నిలిచిపోయిన వైనం
- క్షురకుడి సేవలకు అగ్రస్థానం ఇస్తానన్న ఆనంద్ మహీంద్రా
- హెయిర్ కట్ చేసుకోవడం నేర్చుకోవాల్సి వచ్చిందని వెల్లడి
మహీంద్రా అండ్ మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా లాక్ డౌన్ పరిణామాలపై స్పందించారు. మనం సుఖంగా జీవించడానికి అవసరమైన నిత్యావసర అంశాలు చాలా తక్కువ అని లాక్ డౌన్ మనకు తెలియజెప్పిందని ట్వీట్ చేశారు.
"ఈ సందర్భంగా విలువైన అంశాల జాబితాలో నేను నా క్షురకుడికి తిరుగులేని అగ్రస్థానం ఇస్తాను. ఎందుకంటే, లాక్ డౌన్ కారణంగా నా జుట్టును నేనే ఎలా కత్తిరించుకోవాలి అనే అంశం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి వచ్చింది. చాలావరకు ఈ విద్యను నేర్చుకున్నాననే భావిస్తున్నాను" అని వెల్లడించారు.