సీసీసీకి ‘ఈనాడు’ అధినేత రామోజీరావు పది లక్షల విరాళం.. ’థ్యాంక్స్’ చెప్పిన చిరంజీవి
- రోజు వారీ సినీ కార్మికులను ఆదుకునే నిమిత్తం విరాళం
- ‘మీ ఉదారతకు థ్యాంక్యూ సర్’
- ‘యూ ఆర్ లెజెండ్ సర్’ అంటూ చిరంజీవి ప్రశంసలు
లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేసే రోజు వారీ సినీ కార్మికులను ఆదుకునే నిమిత్తం ప్రముఖ హీరో చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీసీసీకి ఇప్పటికే పలువురు విరాళాలు ఇచ్చారు. తాజాగా, ‘ఈనాడు’ గ్రూప్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు తన వంతు సాయంగా సీసీసీకి రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు.
.ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. ‘మీ ఉదారతకు ’థ్యాంక్యూ సర్’ అని పేర్కొన్నారు. రోజు వారీ సినీ కార్మికులకు మరింత సాయం అందిందని, ఈ పరిశ్రమకు రామోజీరావు సేవలు అసాధారణమైనవని కొనియాడుతూ.. ‘యూ ఆర్ లెజెండ్ సర్’ అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.