‘కరోనా’ నియంత్రణకు దేశీయ సంప్రదాయక ఔషధాలను ప్రోత్సహిస్తున్నాం: లవ్ అగర్వాల్

  • దేశ వ్యాప్తంగా ‘కరోనా’ కేసులు 13,387 నమోదయ్యాయి
  • 1,749 మంది డిశ్చార్జ్ అయ్యారు
  •  80 శాతం మంది కోలుకుంటున్నారు 
‘కరోనా’ నియంత్రణకు దేశీయ సంప్రదాయక ఔషధాలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ‘కరోనా’ కేసులు 13,387 నమోదయ్యాయని, 1,749 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డవారిలో 80 శాతం మంది కోలుకుంటున్నారని వివరించారు. ‘కరోనా’ నివారణకు మరిన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.


More Telugu News