మక్కాలో కరోనాతో చనిపోయిన తెలంగాణ వ్యక్తి
- 35 ఏళ్లుగా సౌదీలోనే ఉంటున్న మృతుడు
- ఆంక్షల కారణంగా అక్కడకు వెళ్లలేని భార్య, పిల్లలు
- వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న భారత కాన్సూల్ జనరల్
ముస్లింలకు అత్యంత పవిత్రమైన సౌదీ అరేబియాలోని మక్కాలో తెలంగాణకు చెందిన ఎన్నారై (61) మృతి చెందారు. జ్వరం కారణంగా గత మంగళవారం ఆయన ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన శాంపిల్స్ ను పరీక్షించగా కరోనా సోకినట్టు తెలిసింది. మృతుడు గత 35 ఏళ్లుగా మక్కాలోనే ఉంటున్నారు. బిన్ లాడెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పని చేస్తున్నారు. మృతుడిది నిజామాబాద్ జిల్లా.
మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య ఇండియాలోనే ఉంటున్నారు. నలుగురు పిల్లలు అల్ ఖోబర్, జుబైల్ లో ఉంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో... ఆయన అంత్యక్రియలకు భార్య, పిల్లలు హాజరుకాలేకపోతున్నారు. ఈ అంశాన్ని భారత్ కాన్సూల్ జనరల్ నూర్ రెహ్మాన్ షేక్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఖననం, ఇతర లాంఛనాలకు అక్కడి సామాజిక కార్యకర్తలు సహకరిస్తున్నారు.
మరోవైపు సౌదీలో నిన్న ఒక్క రోజే 518 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,380కి చేరుకుంది.