విశాఖలో కరోనా రోగుల సంఖ్య తగ్గింది: విజయసాయిరెడ్డి
- వైజాగ్ లో కరోనా తగ్గుముఖం పట్టింది
- బాధితులకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు
- రక్త దానం చేసేందుకు అందరూ ముందుకు రావాలి
విశాఖలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున ఈరోజు ఆయన విశాఖలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని... కరోనా బాధితులకు అండగా నిలబడాలని ఆదేశించారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తం కొరత లేకుండా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విన్నవించారు.