నిఖిల్ గౌడ పెళ్లిపై యడియూరప్ప సర్కారు సీరియస్... రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం!

  • ఓ ఫామ్ హౌస్ లో నిఖిల్ గౌడ వివాహం
  • లాక్ డౌన్ సమయంలో పెళ్లిపై అభ్యంతరాలు
  • విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం
కరోనా వ్యాప్తి కారణంగా, లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తన కుమారుడు నిఖిల్ గౌడ వివాహం జరిపించడంపై యడియూరప్ప సర్కారు సీరియస్ అయింది. లాక్ డౌన్ సమయంలో పెళ్లి జరపడంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రామ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ విషయమై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ్, ఈ పెళ్లిపై చర్యలు తీసుకోకుంటే, వ్యవస్థను వెక్కిరించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఎస్పీతోనూ మాట్లాడామని, వివాహం జరిపించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాగా, బెంగళూరులోని రామ్ నగర్ పరిధిలోని కేతగానహళ్లిలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో నిఖిల్ గౌడకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కృష్ణప్ప మనవరాలు రేవతికి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.


More Telugu News