భారత్‌తో క్రికెట్ ఆడమని చెప్పి భారీ మూల్యం చెల్లించుకున్న పాకిస్థాన్
- ఆ దేశ బోర్డు చివరి మీడియా హక్కుల ద్వారా నష్టపోయిన మొత్తం రూ.691 కోట్లు
- 2008 నుంచి దాయాదితో ద్వైపాక్షిక సిరిస్‌లు రద్దు
- ఐసీసీ టోర్నమెంట్లకు మాత్రమే రెండు దేశాల ఆట పరిమితం
ద్వైపాక్షిక సిరిస్‌లలో భారత్‌తో ఆడేది లేదని తెగేసి చెప్పిన దాయాది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ నిర్ణయం కారణంగా ఒప్పందం ముగుస్తున్న దశలో చివరిగా బోర్డుకు రావాల్సిన రూ.691 కోట్ల ( 90 మిలియన్ డాలర్లు) ఆదాయాన్ని కోల్పోయింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్థాన్ జట్లు ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. 2008 నుంచి ద్వైపాక్షిక సిరిస్‌లను పాకిస్థాన్ రద్దు చేసుకుంది.
పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చివరి ఐదేళ్ల ఒప్పందం గడువు ఈ నెలతో ముగియనుంది. ఈలోగా రెండు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉంది. కానీ పాకిస్థాన్ వచ్చి తమ దేశ ఆటగాళ్లు ఆడరని బీసీసీఐ తేల్చిచెప్పడంతో టెన్ స్పోర్ట్స్ మరియు పీటీవీ మీడియా కుదుర్చుకున్న 149 మిలియన్ డాలర్ల ఒప్పందంలో రావాల్సిన 90 మిలియన్ డాలర్లను ఆ దేశం నష్టపోయింది.