రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న వల్లభనేని వంశీ?

  • నా కష్టసుఖాల్లో వెన్నంటి నిలిచిన అందరికీ ధన్యవాదాలు అన్న వంశీ
  • రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ
  • పోస్టును డిలీట్ చేసిన వంశీ
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ... వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి కారణం ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్ట్. 'పద్నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నా కష్టసుఖాలలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ వంశీ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

వైసీపీలో కూడా వల్లభనేని వంశీ ఇమడలేకపోతున్నారా? రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వాస్తవానికి వైసీపీలో అధికారికంగా వంశీ చేరకపోయినప్పటికీ... ముఖ్యమంత్రి జగన్ కు మద్దతిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు.

చంద్రబాబు, లోకేశ్, టీడీపీలపై ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో వంశీ చేసిన కామెంట్ తో మళ్లీ చర్చ మొదలైంది. వైసీపీ శిబిరంలో వంశీ ఇమడలేకపోతున్నారా? సొంత నియోజకవర్గంలో  తగిన ప్రాధాన్యత దక్కలేదా? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఈ పోస్టు వైరల్ అయిన నేపథ్యంలో... దాన్ని వంశీ తొలగించారు.


More Telugu News