కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే శరణ్యం: ఐక్యరాజ్య సమితి
- వ్యాక్సిన్ వస్తేనే ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుందన్న సెక్రటరీ జనరల్
- శాస్త్రవేత్తలు ఈ ఏడాది చివరికల్లా అభివృద్ధి చేస్తారని ఆశాభావం
- అది సమర్థవంతంగా, సురక్షితంగా ఉండాలని సూచన
కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచం మొత్తం సాధారణ స్థితికి రావాలంటే వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ఒక్కటే మార్గం అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్ అని, ఈ ఏడాది చివరికి శాస్త్రవేత్తలు దాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భాగమైన సుమారు 50 ఆఫ్రికా దేశాలతో ఆంటోనియో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ –19కు సరైన, సురక్షితమైన వ్యాక్సిన్ వస్తేనే ప్రపంచం మొత్తం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని అన్నారు.
ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు 2 బిలియన్ డాలర్ల విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, ఇప్పటికి 20 శాతం మేర సేకరించామని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి 47 ఆఫ్రికా దేశాల్లో ఐక్యరాజ్యసమితి కరోనా టెస్టులు చేస్తోందని చెప్పారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు పలు ఆఫ్రికా దేశాలు తీసుకున్న చర్యలను గుటెర్రస్ మెచ్చుకున్నారు.