సౌదీలోని భారతీయులకు అండగా ఉంటాం: భారత రాయబారి ఔసఫ్ సయాద్
- వారి భద్రతకు తొలి ప్రాధాన్యం
- ప్రవాసీయులు నేరుగా ఎంబసీకి సమస్యలు చెప్పొచ్చు
- వాట్సాప్ ద్వారానైనా సమస్య వివరించాలి
సౌదీ అరేబియాలో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నివేళలా వారికి అండగా ఉంటామని అక్కడి భారత్ రాయబారి ఔసద్ సయాద్ తెలిపారు. నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియాలోనే అత్యధికంగా భారతీయు ఉన్నారని, వారి భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాల్లాగానే సౌదీ కూడా కరోనా వైరస్ సమస్యతో ఆందోళన చెందుతోంది. దీంతో అక్కడ ఉన్న భారతీయుల గురించి వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో భారత రాయబారి ఈ భరోసా ఇచ్చి వారికి కొంత ఊరటనిచ్చారు. ప్రవాసీయులు సమస్య ఉంటే నేరుగా ఎంబసీని సంప్రదించవచ్చునని, లేదంటే 00966546103992 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపవచ్చునని తెలిపారు. ఇప్పటికే భారతీయులు పనిచేస్తున్న అన్ని సంస్థలు, కంపెనీల నిర్వాహకులతో తాము టచ్‌లో ఉన్నామని, అక్కడి భారతీయుల బాగోగుల గురించి ఆరాతీస్తున్నామని చెప్పారు.