అమ్మాయితో యువకుడు అసభ్యంగా తీసిన వీడియో చూసి మండిపడ్డ యాంకర్ అనసూయ.. వీడియో వైరల్
- టిక్‌టాక్ వీడియోపై విమర్శల వర్షం
- 11 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న యువకుడు
- చేసేది మాత్రం సమాజాన్ని తప్పుదోవ పట్టించే వీడియోలు
- అతడి టిక్‌టాక్ ఖాతాను సస్పెండ్ చేయాలన్న అను
అతడు తీసేవి ఎవరికీ ఉపయోగపడని వీడియోలు.. అంతేగాక, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా వెక్కిరింపు ధోరణులతో ఉంటున్నాయి. అయితేనేం అటువంటి వీడియోలే యువతకు నచ్చుతున్నాయి. అతడికి టిక్‌టాక్‌లో ఏకంగా ఓ స్టార్ హీరోకి ఉన్నంత మంది ఫాలోవర్లు ఉన్నారు. 11.8 లక్షల మంది అతడిని ఫాలో అవుతున్నారు. మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆ యువకుడు అందరూ చిరాకు పడేలా తాజాగా మరో వీడియో తీసి, టిక్‌టాక్‌లో పెట్టాడు.
ఈ వీడియోలో ఏముందంటే... ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి అటూఇటూ తూలుతూ వెళ్తుంటాడు. ఓ అమ్మాయి ఎదురుగా వస్తున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆమెకు డ్యాష్ ఇస్తాడు. దీంతో ఆమె కోపంగా చూసి వెళ్లిపోతుంది.
దీంతో అతడు తన అరచేతిపై ఉమ్మి వేసి ఆ అమ్మాయి వద్దకు వెళ్లి సారీ చెబుతున్నట్లు నటించి, షేక్ హ్యాండ్ ఇస్తాడు. దీంతో అది ఆమెకు అంటుతుంది. అనంతరం హీరోలా అతడు తన స్నేహితుడితో కలిసి పోజులు కొడుతూ వెళ్లిపోయాడు. దీనికి మంచి మ్యూజిక్ కూడా యాడ్ చేశాడు
దీంతో అతడి అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని టిక్‌టాక్‌ను పలువురు కోరుతున్నారు. ముంబయి పోలీసులకు, టిక్‌టాక్‌కు ట్విట్టర్‌లో విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిపై యాంకర్ అనసూయ కూడా స్పందించి షాదాబ్ ఖాన్ అనే ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
'ఎవరిని నిందించాలో నాకు తెలియడం లేదు.. ఇతడినా, ఇటువంటి వ్యక్తులను ఫాలో అవుతున్న వారినా.. ఇటువంటి వైరస్ లాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇటువంటి వారిని జైల్లో వేయాలి.. ఇతడి ఖాతాను తొలగించాలని నేను టిక్‌టాక్ ఇండియాను కోరుతున్నాను' అని అనసూయ మండిపడింది.