రెడ్ జోన్ లో.. హెచ్చరికల మధ్య.. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడి వివాహం!.. ఫొటోలు ఇవిగో

  • రేవతితో నిఖిల్ గౌడ వివాహం
  • బెంగళూరు శివార్లలోని ఫామ్ హౌస్ లో నిరాడంబరంగా పెళ్లి
  • కొద్ది మంది మధ్య ముగిసిన వేడుక
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి బెంగళూరు శివారులోని రామనగర సమీపంలో ఉన్న కేతగానహళ్లి ఫామ్ హౌస్ లో నిరాడంబరంగా జరిగింది. కాంగ్రెస్ నేత ఎం.కృష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ పెళ్లి జరిగింది. ఈ వివాహాన్ని చాలా గ్రాండ్ గా చేయాలని తొలుత అనుకున్నప్పటికీ...  లాక్ డౌన్ నేపథ్యంలో సింపుల్ గా కానిచ్చారు. ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది మాత్రమే పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బెంగళూరు కరోనా వైరస్ రెడ్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు, ఈ పెళ్లికి గ్రాండ్ గా ఏర్పాట్లు జరుతున్నాయంటూ కర్ణాటక నేతలు విమర్శలు గుప్పించారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించకపోతే... రెండో ఆలోచన లేకుండా కుమారస్వామిపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్థనారాయణ హెచ్చరించారు. కుమారస్వామి ఒక ప్రజాప్రతినిధి అని... ఎంతో కాలంగా ప్రజా జీవితంలో ఉన్నారని... రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన నిబంధనలను పాటించాలని చెప్పారు. ఇతరులెవరూ పెళ్లికి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని చెప్పారు.

వీటన్నింటి మధ్య కుమారస్వామి తన కుమారుడి పెళ్లిని నిరాడంబరంగా ముగించారు.



More Telugu News