కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలో ఏపీకి నాలుగో స్థానం

  • ప్రతి పది లక్షల మందికి సగటున 331 పరీక్షలు
  • దేశ సగటు 198
  • రాష్ట్రంలో ఇప్పటిదాకా  16,550 మందికి కరోనా టెస్టులు
కరోనా వైరస్‌ పరీక్షల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.  ప్రతి పది లక్షల మందికి సగటున చేస్తున్న పరీక్షల్లో ముందంజలో ఉంది. దేశంలో సగటున 10 లక్షల మందికి 198 పరీక్షలు చేస్తుంటే.. ఏపీలో 331 టెస్టులు చేస్తున్నారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ట్వీట్ చేసింది. రాష్ట్రంలో రోజుకు 3వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటివరకు మొత్తంగా 16,550 మందికి పరీక్షలు నిర్వహించారని తెలిపింది.

ఈ జాబితాలో అగ్రస్థానంలో వున్న రాజస్థాన్‌లో పది లక్షల జనాభాకు సగటున 549 పరీక్షలు చేస్తున్నారు. ఏడు కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా 37,860 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రెండో ర్యాంకులో నిలిచిన కేరళలో సగటున 485 మందికి పరీక్షలు చేయగా.. మొత్తంగా 16,475 మందికి టెస్టు చేశారు. మూడో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో సగటు 446గా ఉండగా.. ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,850 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.


More Telugu News