అమెరికాలో కరోనా విశ్వరూపం.... 30 వేలు దాటిన మృతుల సంఖ్య

  • అమెరికాలో మొత్తం మృతుల సంఖ్య 30,990
  • నిత్యం వేలమంది మృతులతో అమెరికా పరిస్థితి దయనీయం
  • న్యూయార్క్ లో మృత్యుఘంటికలు
  • సగం మరణాలు ఆ నగరంలోనే!
ఫిబ్రవరి మొదటివారం నుంచి అమెరికాలో ప్రతాపం చూపడం మొదలుపెట్టిన కరోనా వైరస్ భూతం ఇప్పటివరకు వేలమంది ప్రాణాలను బలి తీసుకుంది. అమెరికాలో కరోనా పరిస్థితులపై విశ్వసనీయ సమాచారం అందిస్తున్న జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 30,990 మంది మరణించారు. అటు పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలకు సమీపంలో ఉంది.

నిత్యం వేలల్లో కేసుల నమోదు, వేలల్లో మరణాలతో అమెరికా పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా న్యూయార్క్ రాష్ట్రంలోనే సగం మరణాలు నమోదయ్యాయి. అనధికార లెక్కల ప్రకారం అమెరికాలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల అమెరికాలో రోజుకు 2000కు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. 


More Telugu News