కరోనా సంక్షోభం ప్రపంచకప్ లను మించిన కప్... దీన్ని గెలుస్తాం: రవిశాస్త్రి

  • దేశ ప్రజలందరూ సమష్టిగా సత్తా చాటాలన్న రవిశాస్త్రి
  • 11 మంది సరిపోరంటూ వ్యాఖ్యలు
  • ఇంట్లో ఉండడం ద్వారా సురక్షితంగా ఉండాలని పిలుపు
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కరోనా వైరస్ రక్కసిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభం అన్ని వరల్డ్ కప్ లను మించిన కప్ అని, దానిపై తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ సమష్టిగా కృషి చేస్తే గెలుపు తథ్యమని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని రవిశాస్త్రి ఓ వీడియో ద్వారా సందేశం అందించారు.

కరోనా ధాటికి అందరూ గోడలకు చేరగిలపడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అయితే దీన్ని ఓ వరల్డ్ కప్ గా భావించి పోరాడాలని పిలుపునిచ్చారు. "ఇప్పుడు మీ ఎదుట నిలిచి మిమ్మల్ని సవాల్ చేస్తోంది సాధారణమైన ప్రపంచకప్ కాదు. ప్రపంచకప్ లను మించిన ప్రపంచకప్ ఇది. కేవలం 11 మందితో ఆడితే పోయేది కాదు, దీన్ని ఎదుర్కోవాలంటే 130 కోట్ల మంది సత్తా చాటాలి. అయితే ఇంట్లో ఉండడమే దీన్ని ఎదుర్కొనే సురక్షితమైన మార్గం" అంటూ ట్విట్టర్ లో వీడియో పోస్టు చేశారు.


More Telugu News