కడపలో కరోనా నుంచి కోలుకున్న 13 మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు
- కోలుకున్నవారికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్
- వైద్య సిబ్బందికి అభినందనలు
- ఏపీలో 534 కరోనా పాజిటివ్ కేసులు
ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా రక్కసి ఏపీలో గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం పరిమితంగానే ఉన్నా, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాల్లో ఉద్ధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో, కడప జిల్లాలో 13 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకోవడం ఊరట కలిగించే అంశం. వీరిని ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరి కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, వారికి అంకితభావంతో సేవలు అందించారంటూ వైద్య సిబ్బందిని అభినందించారు. ప్రస్తుతం ఏపీలో 534 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గుంటూరు (122), కర్నూలు (113) జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.