25 వేల వాడి పారేసిన ఎన్-95 మాస్క్ ల సేకరణ... ఉతికి, ఇస్త్రీ చేసి అమ్ముతున్న ముఠా!
- మహారాష్ట్రలో మొదలైన కొత్త తరహా దందా
- మాస్క్ లను కల్తీ చేస్తున్న ముఠా
- రూ. 50 లక్షల విలువైన మాస్క్ లు స్వాధీనం
కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు నాణ్యమైన ఎన్-95 మాస్క్ లను వాడితే సరిపోతుందని భావిస్తున్న ప్రజలు ఒక్కసారిగా వాటిని కొనేందుకు ముందుకు వస్తున్న వేళ, మాస్క్ లకు డిమాండ్ తెగ పెరిగిపోయింది. దీంతో మాస్క్ లను కల్తీ చేసే బ్యాచ్ బయలుదేరింది. కొందరు దుర్మార్గులు వాడి పారేసిన ఎన్-95 మాస్క్ లను సేకరించడమే పనిగా పెట్టుకున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఈ మాస్క్ లను సేకరించి, వాటిని ఉతికి, ఇస్త్రీ చేసి తక్కువ రేటుకు అమ్మేస్తున్నారు.
ఈ విషయంలో స్పష్టమైన సమాచారాన్ని అందుకున్న పోలీసులు రైడ్ చేయగా, ఏకంగా 25 వేలకు పైగా మాస్క్ లు దొరకడంతో అవాక్కయ్యారు. వీటి విలువ సుమారు రూ. 50 లక్షలకు పైగానే ఉంటుందని వ్యాఖ్యానించిన అధికారులు, ముగ్గురిపైనా నిత్యావసరాల చట్టం, ఎపిడెమిక్స్ చట్టం, కొవిడ్ చట్టాల కింద కేసు పెట్టినట్టు వెల్లడించారు.