'భక్త కన్నప్ప' బడ్జెట్ 92 కోట్లు: మంచు విష్ణు
- 'భక్త కన్నప్ప' చేయాలనే కోరిక బలంగా వుంది
- నాన్నగారు 70 కోట్లలో చేయమన్నారు
- నాపై అంత బడ్జెట్ వర్కౌట్ కాదన్న విష్ణు
ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా ఒక ప్లానింగ్ తో మంచు విష్ణు ముందుకు వెళుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రధారిగా 'భక్త కన్నప్ప' రూపొందనుందనే వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు.
'భక్త కన్నప్ప' సినిమా చేయాలనే కోరిక బలంగా వుంది. ఈ సినిమాను 70 కోట్ల బడ్జెట్లో పూర్తి చేయమని నాన్నగారు అన్నారు. ఇటీవలే మేము బడ్జెట్ వేసుకుంటే 92 కోట్ల వరకూ అవుతుందనే విషయం స్పష్టమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ నాపై వర్కౌట్ కాదు. అందువల్లనే 'మోసగాళ్లు' సినిమా విడుదలైన తరువాత ఆలోచిద్దామని అనుకుంటున్నాను. 'మోసగాళ్లు' కథపై నాకు బలమైన నమ్మకం వుంది. ఆ సినిమా హిట్ అయితే, ఆరునెలలో గానీ .. ఏడాదిలో గాని 'భక్త కన్నప్ప' చేసే అవకాశాలు వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.