ఆమె కారు డ్రైవింగ్‌ సరదా తీరింది... కానీ భర్తపై బదిలీ వేటు పడింది!

  • ప్రభుత్వ కారులో డ్రైవింగ్‌ నేర్చుకున్న సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ భార్య
  • దీన్ని వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచిన యువకుడు
  • సదరు అధికారిని ట్రాన్స్ ఫర్‌ చేసిన కలెక్టర్‌
అసలే లాక్‌డౌన్‌ సమయం. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మరో వైపు భర్తకు ప్రభుత్వం సమకూర్చిన కారు ఖాళీగానే ఉంది. ఇంకేం...ఇంతకు మించిన అవకాశం ఇంకెప్పుడు దొరుకుతుందనుకుందా మహిళ. సర్కారు కారులో హాయిగా డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు బయుదేరింది.

అయితే, దీన్ని వీడియో తీసిన ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో సదరు మహిళ భర్తపై కలెక్టర్‌ బదిలీ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రైసన్‌ జిల్లా సిల్వానీ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ భార్య భర్తకు ప్రభుత్వం సమకూర్చిన కారులో ఇటీవల డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. దీన్ని గమనించిన ఓ యువకుడు ఆమెను ప్రశ్నించాడు.

విషయం తెలుసుకుని వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. ఇంకేం.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన సదరు సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌పై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో వేరొకరిని నియమించారు.


More Telugu News