ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెరిగిన కొవిడ్-19 కేసులు
- నిన్న సాయంత్రం 7 నుంచి ఈ రోజు ఉదయం 9 మధ్య 9 మందికి కరోనా
- కృష్ణా జిల్లాలో 3, కర్నూలులో 3, పశ్చిమ గోదావరిలో 3 కేసులు
- మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 534
- అత్యధికంగా గుంటూరులో 122 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 వరకు జరిపిన కొవిడ్19 పరీక్షల్లో మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో 3, కర్నూలులో 3, పశ్చిమ గోదావరిలో 3 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా నమోదైన 9 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 534 కి పెరిగిందని వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన మొత్తం 534 పాజిటివ్ కేసుల్లో ఇప్పటివరకు 20 మంది డిశ్చార్జ్ అయ్యారని, 14 మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 500 అని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా గుంటూరులో 122 కేసులు నమోదుకాగా ఆ తర్వాత కర్నూలులో 113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు..?