సామాజిక దూరం పాటిస్తూ టీకాలు: ఏపీ ప్రభుత్వం ప్రకటన
- శిశువులు, పిల్లలు, గర్భిణీలకు తక్షణమే ఇస్తున్నట్టు ప్రకటన
- సబ్ సెంటర్, గ్రామ, వార్డు సచివాలయాలు, ఈయూ పీహెచ్‌సీల్లో అందుబాటులో టీకాలు
- రెడ్ జోన్లకు మాత్రం మినహాయింపు
శిశువులు, పిల్లలు, గర్భిణీలకు క్రమం తప్పకుండా ఇచ్చే రోగ నిరోధక టీకాలను వెంటనే వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్ సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ వారికి టీకాలు అందించనుంది. టీకాలు ఎక్కడెక్కడ వేస్తారో తెలిపింది. కరోనా ప్రభావిత రెడ్ జోన్ మినహా సబ్ సెంటర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, ఈయూ పీహెచ్‌సీల్లో (ఎలక్ట్రానిక్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం) టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
టీకాలను ఆశా వర్కర్లు వేస్తారని చెప్పింది. వాళ్లు టీకాలు ఇచ్చే సమయాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేస్తారని తెలిపింది. ఆయా కేంద్రాల్లో ప్రతి 30 నిమిషాల్లో నలుగురికి మాత్రమే టీకాలు ఇస్తారని, ఇందుకోసం వారికి ముందుగానే స్లాట్స్‌ను కేటాయిస్తారని చెప్పింది. టీకాలు ఇచ్చే సమయంలో వారి మధ్య ఐదు నుంచి ఏడు అడుగుల దూరం పాటిస్తారని ప్రభుత్వం తెలిపింది.