భుజాలపై తండ్రిని ఎత్తుకుని నడిచిన కుమారుడు... వీడియో వైరల్!
- కేరళలోని కొల్లాం ప్రాంతంలో ఘటన
- ఆసుపత్రి నుంచి తండ్రిని తెచ్చేందుకు ఆటోను అనుమతించని పోలీసులు
- విచారణకు ఆదేశించిన మానవ హక్కుల సంఘం
ఆరోగ్యం క్షీణించిన తండ్రి ఆసుపత్రిలో కోలుకోగా, ఇంటికి తీసుకుని వెళ్లే నిమిత్తం, దాదాపు కిలోమీటర్ దూరం పాటు మోసుకుని వెళ్లిన ఓ కుమారుడి వీడియో వైరల్ కాగా, మానవ హక్కుల సంఘం స్పందించి విచారణకు ఆదేశించింది. ఈ ఘటన కేరళలోని కొల్లాం ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి పునలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన జార్జ్ (89) డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కుమారుడు రోయ్ మన్ ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాడు.
లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా తండ్రిని ఇంటికి చేర్చేందుకు ఆటో తీసుకుని వెళ్లగా, రోడ్డుపై పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రిని తీసుకుని వచ్చేందుకు ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. దీంతో అక్కడే ఆటోను నిలిపి, కిలోమీటర్ దూరంలో ఉన్న ఆసుపత్రికి నడుస్తూ వెళ్లి, అక్కడి నుంచి తండ్రిని భుజాలపై మోస్తూ, ఆటో వద్దకు చేరుకున్నాడు.
మార్గమధ్యంలో బందోబస్తులో ఉన్న పోలీసులు, రోయ్ మన్ ను చూసి కూడా స్పందించలేదు. ఈ ఘటనకు చెందిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన కేరళ మానవ హక్కుల సంఘం, విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని కొల్లాం ఎస్పీని ఆదేశించింది. ఈ విషయంలో పోలీసులు మాత్రం, సదరు ఆటో డ్రైవర్ ను ఆసుపత్రి పత్రాలు అడిగితే చూపించలేదని, అందుకే ముందుకు వెళ్లేందుకు అనుమతించ లేదని చెప్పారు. పోలీసులు ప్రవర్తించిన తీరును పలువురు ఎండగడుతున్నారు.