ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట.. శరవేగంగా రిఫండ్‌ దరఖాస్తుల పరిశీలన

  • వారం రోజుల్లో 10.2 లక్షల దరఖాస్తులు క్లియర్‌
  • రూ.4,250 కోట్ల రిఫండ్‌ లబ్ధిదారుల ఎకౌంట్లకు జమ
  • పరిశీలనలో మరో 1.75 లక్షల దరఖాస్తులు
కరోనా కష్టకాలంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కాస్తయినా ఊరటనివ్వాలన్న ఉద్దేశంతో రిఫండ్‌ దరఖాస్తుల పరిశీలనను ఆదాయపు పన్ను శాఖ వేగవంతం చేసింది. ఐదు లక్షల మొత్తం వరకు చెల్లించాల్సి ఉన్న దరఖాస్తులను ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో పరిశీలన పూర్తిచేసి దరఖాస్తుదారులకు డబ్బు అందేలా చూస్తామని కేంద్ర ఆర్థిక శాఖ గత వారం ప్రకటించిన విధంగానే అధికారులు పని పూర్తిచేశారు. వారం రోజుల వ్యవధిలోనే 10 లక్షల 20 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయడం గమనార్హం.

ఇందుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులకు ఇవ్వాల్సిన 4,250 కోట్ల రూపాయల మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ‘మరో లక్షా డెబ్బయి ఐదు వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా గరిష్టంగా ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ప్రాసెస్‌ చేసి పన్ను చెల్లింపుదారుల అకౌంట్లకు రిఫండ్‌ మొత్తాన్ని జమ చేస్తాం’ అని అధికారులు స్పష్టం చేశారు.


More Telugu News