ఏపీ సీఎం చైర్ వెనుక కనిపించే పూర్ణ వికసిత పద్మం చిహ్నం తొలగింపు!
- బంగారు వర్ణంలో మెరిసే పూర్ణ వికసిత పద్మం
- దాని స్థానంలో ఏపీ ప్రభుత్వ చిహ్నం
- తొలగించిన కారణాన్ని ఇంకా వెల్లడించని ప్రభుత్వం
అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం సీటు వెనుక బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించే పూర్ణ వికసిత పద్మం ఇకపై కనిపించదు. నిన్న దాన్ని తొలగించిన అధికారులు, పద్మం స్థానంలో ఏపీ ప్రభుత్వ చిహ్నాన్ని అమర్చారు. క్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడు, తాను సీఎంగా ఉన్న వేళ, పూర్ణ వికసిత పద్మాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఆపై జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత దీన్ని తొలగించలేదు. జగన్ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, రివ్యూలు చేసినా, అన్ని ఫోటోల్లో ఆయన బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిహ్నం మెరుస్తూ కనిపించేది.
అమరావతికి ఉన్న చారిత్రక ప్రాధాన్యంతో పాటు బౌద్ధుల చరిత్రను గుర్తు చేయాలన్న ఆలోచనతో దీన్ని రూపొందించారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ఈ డిజైన్ ఆయనకూ నచ్చిందన్న వార్తలు వచ్చాయి. తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సమావేశ మందిరంలోనూ ఇదే చిహ్నాన్ని పెట్టించుకున్నారు. ఇక ఇంత హఠాత్తుగా, తన సమావేశ మందిరం నుంచి జగన్, దీన్ని ఎందుకు తొలగించారన్న విషయమై అధికారిక సమాచారం లేదు.