మార్చి 25- ఏప్రిల్ 14 మధ్య ముంబై నుంచి 3700 మంది విదేశీయుల తరలింపు

  • లాక్‌డౌన్ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు
  • 20 ప్రత్యేక విమానాల ద్వారా ఆయా దేశాలకు తరలింపు
  • 240 కార్గో విమానాల ద్వారా ఎగుమతి, దిగుమతులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో వివిధ దేశాలకు చెందిన పలువురు పర్యాటకులు, పౌరులు ముంబైలో పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయారు. వారందరినీ ఆయా దేశాలకు తరలించేందుకు ముందుకొచ్చిన భారత్, ఇందుకోసం ప్రత్యేక విమానాలను నడుపుతోంది.

ఆ విధంగా గత నెల 25 నుంచి ఈ నెల 14 మధ్య 20 ప్రత్యేక విమానాల ద్వారా ముంబై విమానాశ్రయం నుంచి 3700 మందిని కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య ఆయా దేశాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. తరలించిన ప్రయాణికుల్లో లండన్, అట్లాంటా, ఫ్రాంక్‌ఫర్ట్, సింగపూర్, పారిస్, టోక్యో నగరాలకు చెందిన వారు ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, 240 కార్గో విమానాల ద్వారా వివిధ దేశాలకు ఎగుమతులు, దిగమతులు జరిపినట్టు వివరించారు.


More Telugu News