చేతిపై ఉన్న 'ప్రభుదేవా' పేరు టాటూను చెరిపేయించుకున్న నయనతార!
- తొలుత శింబుతో ప్రేమ
- ఆపై ప్రభుదేవాకు దగ్గరైన నయనతార
- ఆ సమయంలోనే చేతిపై పచ్చబొట్టు
- ఇప్పుడు విఘ్నేశ్ శివన్ తో డేటింగ్ చేస్తున్న నయనతార
సౌతిండియా టాప్ హీరోయిన్లలో ఒకరైన నయనతార చేతిపై నిన్నటివరకు కనిపించిన మాజీ ప్రియుడు ప్రభుదేవా పేరు ఇప్పుడు మాయమైంది. ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమయంలో, ఆమె తన ఎడమ చేతిపై ఆ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న సంగతి తెలిసిందే.
అంతకుముందు తమిళ హీరో శింబుతో లవ్ లో పడిన నయన్, బ్రేకప్ తరువాత, ప్రభుదేవాకు దగ్గరైంది. వీరిద్దరికీ పెళ్లి ఖాయమని కూడా వార్తలు వినిపించాయి. కానీ, ఆ ప్రేమ కూడా వర్కవుట్ కాలేదు. ఇక ప్రస్తుతం నయన్, విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో వుంది. చానాళ్ల నుంచే వీరి ప్రేమ కొనసాగుతోంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న చిత్రాలు నెట్టింట కొన్ని వందలు దర్శనమిస్తున్నాయి. తాజాగా, 'ప్రభుదేవా' అన్న పేరుండాల్సిన చోట 'పాజిటివిటీ' అన్న అక్షరాలను నయన్ వేయించుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.