ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల మండిపాటు
- కేంద్రం నుంచి వచ్చిన ‘కరోనా’ ఉపశమన నిధులు విడుదల చేయరేం?
- ఆ నిధులు విడుదల చేయొద్దంటూ ట్రెజరీలకు ఆంక్షలా?
- ఇలాంటి పరిస్థితుల్లో నిధులు విడుదల చేయొద్దంటారా?
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఘాటు విమర్శలు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన ‘కరోనా’ ఉపశమన నిధులను తొక్కిపెట్టడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలకు, ‘కరోనా’ ఉపశమన సహాయక చర్యలకు నిధులు విడుదల చేయొద్దని ట్రెజరీలకు ఆంక్షలు జారీ చేయడం అమానుషమంటూ విరుచుకుపడ్డారు. ఈ ఏడాదిలో రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులు, కోవిడ్-19 ఉపశమన నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, డివల్యూషన్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చాయని, ఆ నిధులన్నింటిని ట్రెజరీ స్థాయిలోనే నిలిపివేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
’కరోనా’ బారిన పడ్డ వారికి వైద్యసేవలందిస్తున్న వారికి అవసరమైన మాస్కులు, కిట్స్, పీపీఈలను సమకూర్చాలంటే నిధులు అత్యవసరమని, కేంద్రం ఇచ్చిన నిధులు ఉన్నప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు విడుదల చేయొద్దని చెప్పే ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని వలస కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.