నెక్స్ట్ సినిమా వుంది .. కానీ సమంతతో కాదు: నందినీ రెడ్డి

  • బయట జరుగుతున్నదంతా ప్రచారమే
  • సమంతతో మళ్లీ చేసే ఛాన్స్ వస్తే నేనే చెబుతాను
  • ప్రస్తుతం చేస్తున్నది రీమేక్ కాదన్న నందినీ రెడ్డి
'ఓ బేబీ' సినిమాతో నందినీ రెడ్డి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓ కొరియన్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా, సమంత కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. నందినీ రెడ్డి తన తదుపరి సినిమా కూడా సమంతతోనే చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. రీమేక్ గానే ఈ సినిమా రూపొందనుందనే టాక్ వచ్చింది.

తాజాగా ఈ విషయాన్ని గురించి నందినీ రెడ్డి స్పందించారు. "నెక్స్ట్ సినిమాకి సంబంధించిన పనుల్లోనే వున్నాను. అయితే ఈ ప్రాజెక్టులో సమంత లేదు. సమంతతో నేను సినిమా చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు .. అవన్నీ పుకార్లే. ఒకవేళ సమంతతో చేసే అవకాశం మళ్లీ వస్తే నేనే చెబుతాను. ఇక బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది రీమేక్ కూడా కాదు .. స్ట్రయిట్ సినిమానే. ఈ సినిమాకి స్వప్న దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలను తెలియజేస్తాను" అని చెప్పుకొచ్చారు.


More Telugu News