ప్రకృతి వనరులను కాపాడే 'ఆచార్య'

  • ఇటీవలే మొదలైన కొరటాల సినిమా
  • లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగ్
  • ఇది ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పిన చిరూ
చిరంజీవి తన తదుపరి సినిమాను కొరటాల దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. ప్రాచీన కాలం నాటి ఆలయాలు .. ఆక్రమణకి గురైన వాటి భూములకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే టాక్ వినిపించింది.

అయితే తాజాగా చిరంజీవి ఓ ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అనీ, ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటంగా సాగుతుందని చెప్పారు. ఇందులో దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం కూడా వుండే అవకాశం వుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.


More Telugu News