ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ రుణం తీర్చుకునేందుకు తొందరపడుతున్నట్లున్నారు: టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా
- కనగరాజ్ ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది
- ప్రజలు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు
- ఈ సమయంలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనడం దారుణం
తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన ఏపీలోని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రుణం తీర్చుకునేందుకు జస్టిస్ కనగరాజ్ తొందరపడుతున్నట్లున్నారని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అందుకే ఆయన హడావుడిగా బాధ్యతలు చేపట్టినట్లున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తారనుకోవడం అత్యాశ అవుతుందేమోనని ట్వీట్ చేశారు.
‘రాష్ట్ర ప్రజలు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయట పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడడం ఆశ్చర్యమే. ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరగవచ్చునని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు.