ఈ నెల 17 నాటికి ‘గ్రీన్ జోన్’గా గోవా: సీఎం ప్రమోద్ సావంత్
- ఇప్పటి వరకూ ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
- గత 11 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు
- దక్షిణ గోవాను గ్రీన్ జోన్ గా ఇప్పటికే కేంద్రం ప్రకటించింది
ఈ నెల 17 నాటికి ‘కరోనా’ రహిత రాష్ట్రంగా గోవా మారుతుందని, ‘గ్రీన్ జోన్’ గా మారనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ధీమా వ్యక్తం చేశారు. గోవాలో రెండు జిల్లాలు మినహా దక్షిణ గోవాను గ్రీన్ జోన్ గా ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
గత పదకొండు రోజులుగా గోవాలో ‘కరోనా’ కేసులు కొత్తగా నమోదు కాలేదని చెప్పారు. ఇప్పటి వరకూ తమ రాష్ట్రంలో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఆ కేసులన్నీ నార్త్ గోవాకు చెందినవే అని అన్నారు. నిత్యావసర వస్తువులతో తమ రాష్ట్రంలోకి వచ్చే వాహనాలన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శానిటైజింగ్ మార్గాల ద్వారానే రావాలని చెప్పారు. గతంలో ప్రకటించినట్టు ఏప్రిల్ 14 నుంచి కాకుండా 20వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు హాజరుకావాలని ఆదేశించారు. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు.