ఎయిర్ బ్యాగ్ మెటీరియల్ తో మెడికల్ గౌన్లు తయారుచేస్తున్న ఫోర్డ్ కంపెనీ
- కరోనా నేపథ్యంలో ఫోర్డ్ దాతృత్వం
- వైద్యసిబ్బంది, రోగుల కోసం మెడికల్ గౌన్ల తయారీ
- వారానికి లక్ష గౌన్లు తయారుచేసేందుకు ఏర్పాట్లు
ఇప్పుడొస్తున్న ప్రీమియం సెగ్మెంట్ కార్లలో రక్షణ కోసం ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రముఖ కార్ల తయారీదారు ఫోర్డ్ ఎయిర్ బ్యాగులు తయారుచేసే మెటీరియల్ తో వైద్యసిబ్బంది, రోగులు, ఇతర సిబ్బంది కోసం కోసం ప్రత్యేక మెడికల్ గౌన్లు తయారుచేస్తోంది. వారానికి లక్ష వరకు ఈ మెడికల్ గౌన్లు తయారుచేయాలన్నది ఫోర్డ్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇప్పటికే అమెరికాలోని ప్లిమౌత్, మిచిగాన్ లోని తన ప్లాంట్లలో 30 లక్షల ఫేస్ షీల్డులు తయారుచేసిన ఫోర్డ్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మెడికల్ గౌన్లు రూపొందిస్తోంది. అందుకోసం ఫోర్డ్ కంపెనీ బ్యూమోంట్ హెల్త్ కేర్ తో కలిసి పనిచేస్తోంది. ఈ క్రమంలో 5000 మెడికల్ గౌన్లను అమెరికాలోని వివిధ ఆసుపత్రులకు అందించారు. కాగా, ఫోర్డ్ సంస్థ భారత్ లోనూ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థతో కలిసి ఫేస్ షీల్డుల తయారీలో పాలుపంచుకుంటోంది. అటు, బ్రిటన్ లో కూడా ఫోర్డ్ దాతృత్వ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. భారీగా వెంటిలేటర్ల ఉత్పత్తి చేయాలని భావిస్తోండగా, ప్రస్తుతానికి ఆ కార్యాచరణ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.