కరోనా బారిన పడి మృతి చెందిన పాక్ మాజీ క్రికెటర్

  • మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ మృతి
  • 1988లో క్రికెట్లోకి అరంగేట్రం
  • అనంతరం కోచ్ బాధ్యతలను చేపట్టిన సర్ఫరాజ్
పాకిస్థాన్ లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. కరోనా బారిన పడి పాక్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ మృతి చెందారు. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు. అయితే ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో తుదిశ్వాస వదిలారు. 1988లో క్రికెట్లోకి ఆయన అరంగేట్రం చేశారు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. ఆరేళ్ల పాటు క్రికెట్ ఆడి 1994లో రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం కోచింగ్ బాధ్యతలను చేపట్టారు. జాతీయ టీమ్ తో పాటు, పెషావర్ అండర్-19 టీమ్ కు కోచ్ గా వ్యవహరించారు. జాఫర్ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపాన్ని ప్రకటించారు.


More Telugu News