హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు!

  • ఆండ్రూ కొచీవ్ కు జలుబు, జ్వరం
  • ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు
  • సమస్య తీవ్రమైతే ఆసుపత్రికి తీసుకెళతామన్న శ్రియ
దక్షిణాది అందాల నటి శ్రియ భర్త ఆండ్రూ కొచీవ్ లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని శ్రియ స్వయంగా వెల్లడించింది. తన భర్త పొడి దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతూ ఉన్నారని, ముందు జాగ్రత్తగా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయి, ప్రత్యేక గదిలో ఉంటున్నాడని చెప్పింది. తన భర్తలో ఈ లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యానని పేర్కొంది. ప్రస్తుతానికి ఎటువంటి ఇతర అనారోగ్య సమస్యలూ లేవని, ఒకవేళ ఎదురైతే ఆండ్రూను ఆసుపత్రికి తరలిస్తామని వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం ఈ జంట స్పెయిన్ లో ఉంది. స్పెయిన్ లో కరోనా మరణమృదంగాన్ని మోగిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తన భర్తతో తాను చాలా ఆనందంగా ఉన్నానని చెబుతూ, ఇటీవలే శ్రియ తన సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను పోస్ట్ చేసింది. ఇంతలోనే తన భర్తలో కరోనా లక్షణాలు కనిపించాయని ఆమె చెప్పడంతో ఫ్యాన్స్ లోనూ కొంత ఆందోళన నెలకొంది. ఇక ఆండ్రూకు కరోనా టెస్ట్ జరిగిందా? పాజిటివ్ వచ్చిందా? లేదా? అన్న విషయమై శ్రియ ఎటువంటి సమాచారాన్ని అందించలేదు.


More Telugu News