లాక్ డౌన్ తర్వాత విద్యార్థులకు కొంత సమయం ఇచ్చి పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తాం: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్

  • లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన 10వ తరగతి పరీక్షలు
  • ప్రస్తుతం ఆన్ లైన్ లో బోధన
  • దూరదర్శన్ సప్తగిరి చానల్లో ఉదయం, సాయంత్రం పాఠాలు
కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించడంతో ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత విద్యార్థులకు ముందుగా ప్రిపరేషన్ కు సమయం ఇచ్చి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం దూరదర్శన్ సప్తగిరి చానల్ లో 10వ తరగతి విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నారని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆన్ లైన్ బోధన ఉంటుందని వివరించారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అటు, దేశవ్యాప్త లాక్ డౌన్ ను కేంద్రం మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.


More Telugu News