పవన్ కల్యాణ్ 'విరూపాక్ష' కోసం భారీ సెట్లు
- క్రిష్ నుంచి మరో చారిత్రక చిత్రం
- కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ
- 'మొరాకో'లో షూటింగు రద్దు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ 'విరూపాక్ష' అనే ఒక చారిత్రక కథను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మొగల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుంది. వాళ్ల అధీనంలో వున్న 'కోహినూర్' వజ్రం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా షూటింగును 'మొరాకో'లో ఆరంభించాలని క్రిష్ బృందం అనుకుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన ప్రభావం చూపుతోంది. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోవలసి వస్తుందో అనే ఆందోళన అందరిలోను వుంది.
ఈ కారణంగానే విదేశాల్లో షూటింగు పెట్టుకోవడం అంత మంచిది కాదనే నిర్ణయానికి క్రిష్ బృందం వచ్చిందట. హైదరాబాద్ లోనే భారీ సెట్స్ వేసి చిత్రీకరణ జరపాలని భావిస్తున్నారు. పవన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా అనుష్క .. జాక్విలిన్ పేర్లు వినిపిస్తున్నాయి.