బన్నీ మిస్సైన హిట్, ఫ్లాప్ చిత్రాలు ఇవే!

  • వివిధ కారణాల వల్ల హీరోలు కొన్ని సినిమాలు మిస్సవుతుంటారు
  • బన్నీ మిస్సయిన హిట్ సినిమాలలో 'జయం', '100 % లవ్'  
  • తప్పించుకున్న ఫ్లాపులలో 'గ్యాంగ్ లీడర్', 'డిస్కోరాజా'
ఏ హీరో అయినా బిజీగా ఉండటం వలన .. డేట్లు కుదరకపోవడం వలన కొన్ని సినిమాలు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. తమకి సరిపడవనే ఉద్దేశంతో వదులుకునే సినిమాలు మరికొన్ని ఉంటూ ఉంటాయి. ఎలా వదులుకున్నా ఆ సినిమాలు హిట్లు కొట్టినప్పుడు, చిన్నపాటి బాధ కలగడమనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది.

అలా కొన్ని కారణాల వలన బన్నీ వదులుకున్న సినిమాల జాబితాలో 'జయం' .. 'భద్ర' .. '100 % లవ్' .. 'పండగ చేస్కో' .. 'అర్జున్ రెడ్డి' .. 'గీత గోవిందం' సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ కథలు ముందుగా బన్నీ దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన చేయలేకపోయాడట. ఆ తరువాత ఆ సినిమాలు వేరే హీరోలకి హిట్లు తెచ్చిపెట్టాయి. ఇక విక్రమ్ కుమార్ 'గ్యాంగ్ లీడర్' .. చైతూ 'ఒక లైలా కోసం' .. రవితేజ 'డిస్కోరాజా' కథలు కూడా బన్నీ దగ్గరికే ముందుగా వచ్చాయట. ఆయన ఆ సినిమాలను వదులుకోగా అవి పరాజయం పాలయ్యాయి.


More Telugu News